అధ్యక్ష ఎన్నికల బరిలో జో బైడెన్
అమెరికా అధ్యక్ష రేసుకు డెమోక్రటిక్ అభ్యర్థిగా జోసెఫ్ బైడెన్ అధికారికంగా కన్ఫర్మ్ అయ్యారు. నవంబర్‌లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ పోటీ చేయనున్నారు. తన పార్టీ అభ్యర్థిత్వానికి సంబంధించి నామినేషన్లో 1991 ఓట్లు గెలుచుకున్నట్లు బైడెన్ తన ట్విట్టర్లో తెలిపారు. దేశ ఆత్మను కాపాడేందుకు ఇక తాను అధ్యక్ష పోరులో నిలవనున్నట్లు బైడెన్ ఆ ట్వీట్లో వెల్లడించారు. ఏప్రిల్‌లో పార్టీ రేసు నుంచి బెర్నీ శాండర్స్ తప్పుకోవడంతో బైడెన్ రూటు సులువైంది. మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా హయాంలో జోసెఫ్ బైడెన్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.













