హ్యూస్టన్ జనసేన కవాతు
రాజకీయ జవాబుధారితనం పై ప్రశ్నిస్తూ జనసేన తలపెట్టిన “గోదావరి కవాతు” పై, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేర ప్రపంచవ్యాప్త స్పందనలో బాగంగా సుమారు వందమందిపైగా జనసేన కార్యకర్తలు హ్యూస్టన్ ఎల్రిడ్జ్ పార్క్ లో “హ్యూస్టన్ జనసేన కవాతు” ఆదివారం అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం జరిపారు.
రవి వర్రె, గోపాల్ గూడపాటి, శేషాద్రి మంచెం, వీర బద్ర కంబాల, సత్యం రావుల, అజయ్ పోతుల, ముకుందా గట్టు, ప్రసాద్ పావిరాల, వెంకట్ కట్ట, సుధీర్ ఇందాల, రాజేష్ యాళ్ళబండి, క్రిష్న బయన, సురేష్ సత్తి, ప్రసద్ లాలం, రాజు మేరుగ మొదలగు కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిన ఈ కవాతులో రాష్ట్ర ప్రస్తుత పరిస్తితులు, రాజకీయ జవాబుదారీతనం, “JSP for New Age Politics” ఆవస్యకత, జనసేన నవతరం రాజకీయాల వలన ఒనగూడే లాభాలు, జనసేన సిద్ధాంతాలు, కార్యక్రమాలు, జనసేన ద్వారా రాబోయే మార్పు, రాజకీయ ప్రక్షాళణ… మొదలగు అంశాలపై విపులంగా చర్చించారు.
“గోదావరి కవాతు” జనసేన భవిష్య కార్యాచరణలకు తమవంతు సహాయ సహకారాలందిస్తామని హ్యూస్టన్ జనసైనికులు తెలియజేశారు.
ఈ సంధర్భంగా సైక్లోన్ తిత్లీ విపరీతంవలన మరణించిన ప్రజలకి జనసైనికులు సంతాపం వ్యక్తపరిచారు. సైక్లోన్ వలన జరిగిన నష్టానికి విచారిస్తూ, తగు సహాయం ప్రకటించారు.
ఎల్రిడ్జ్ పార్కు ఎల్రిడ్జ్ పార్కు చుట్టూ ఒక వలయంగా హ్యూస్టన్ జనసైనికులు కవాతు నిర్వహించారు. జనసేన సిద్ధాంతాలతో, స్లోగన్లతో ఎల్రిడ్జ్ పార్కు మరియూ పరిశరప్రాంతాలు మారుమ్రోగాయి.
Ravi Varre:
Gopal Gudapati:
Seshadri Manchem:
Jalakam Uncle:
Nag Mekala:
Prasad Lalam:
Rajesh Yallabandi:
Suresh Satti:
JANASENA USA Kavathu
#Janasena
#Pawankalyan
#NewAgePolitics
#kavathu
Atlanta
Virginia
Bay Area
Dallas
Houston
NYC
Delaware













