హూస్టన్ లో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్
అమెరికాలోని హ్యూస్టన్‌లో మొదటిసారిగా జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ జరగనున్నది. కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్, యూఎస్ అంబాసిడర్ నవజీత్నర్ణా తెలిపారు. ఈ సమావేశాలు ఈ నెల 14, 15 తేదీలలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఫెస్టివల్‌కు శశిథరూర్ హాజరు కావచ్చని భావిస్తున్నారు. యూఎస్‌లో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. హూస్టన్, టెక్సాస్‌లలో సెప్టెంబరు 14, 15 తేదీలలో జరుగుతుందని, న్యూయార్క్‌లో 19, 20 తేదీలలో, బ్లౌండర్, కొలరాడలో సెప్టెంబరు 21, 23 తేదీలలో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ జరగనున్నట్లు నవజీత్నర్ణా పేర్కొన్నారు. ఈ ఫెస్టివల్స్ లలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలుంటాయని, విభిన్న కళల ప్రదర్శన ఉంటుందని ఆయన తెలిపారు.













