అమెరికా బెదిరింపులకు తలొగ్గం
అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదని ఇరాన్ పునరుద్ఘాటించింది. ఇరాన్‌పై భారీ ఆంక్షలను మోపి రాజీకి రప్పించాలని అమెరికా ప్రయత్నిస్తోందని, ఇలాంటి చౌకబారు చర్యలకు ఇరాన్ రాజీపడదని అద్యక్షుడు హస్సన్ రౌహానీ పేర్కొన్నారు. ఇరాన్‌పై ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడాలన్నదే అమెరికా లక్ష్యమని విమర్శించారు. ఇరాన్‌పై మోపిన ఆంక్షల ఎత్తివేత అంశంపై అమెరికా స్పందించినట్టయితే చర్చల అంశంపై పునరాలోచిస్తామని అన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి మొహ్మద్ జవాద్ జరీఫ్‌తో భేటీ అనంతరం రౌహానీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా, ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని మిత్రదేశాలపై అమెరికా ఒత్తిడి పెంచింది. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ ఆంక్షలు మోపుతామంటూ హెచ్చరించింది. ఇరాన్ ఇంటరి చేసేందుకు ఆ దేశంపై భారీ ఆంక్షలు మోపింది.













