ఫేస్ బుక్ కు మరో షాక్
ఫేక్ న్యూస్, డేటాచోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరో ఎదరుదెబ్బ తగిలింది. ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ ఫొటో షేరింగ్ ప్లాట్‌పాం ఇన్స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకులు కెవిన్ సిస్ట్రోమ్, మైక్ క్రెెగర్ తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొన్ని వారాల్లో కంపెనీని వీడుతున్నట్లు ప్రకటించారు. సిస్ట్రోమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవిలో, క్రెగర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఎందుకు రాజీనామా చేస్తున్నది సృష్టత ఇవ్వకుండానే రాజీనామా లేఖను కంపెనీకి సమర్పించారు. వీరి రాజీనామా విషయాన్ని సంబంధిత వర్గాలు తమకు తెలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.













