అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు అరెస్టు
అక్రమంగా వలస వచ్చిన సుమారు 100 మందిని అమెరికా అరెస్టు చేసింది. బోర్డర్ ప్యాట్రోల్, ఇమ్మిగ్రేషన్ అధికారులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు. గత అయిదు రోజులుగా హూస్టన్‌లో జరిగిన గాలింపు చర్యల్లో, ఇమ్మిగ్రేషన్ అధికారులు 45 మందిని అరెస్టు చేశారు. అయితే అరెస్టు అయిన వారిలో ఎంత మంది భారతీయులు ఉన్నారన్న అంశాన్ని ఏజెన్సీ వెల్లడించలేదు. హోండర్స్, ఎల్ సాల్వడార్, మెక్సికో, గాటేమాల, అర్జెంటీనా, క్యూబా, నైజీరియా, చిలీ, టర్కీతో పాటు భారత దేశస్థులు ఉన్నారని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. డిపోర్ట్ అయిన తర్వాత కూడా కొందరు అక్రమగా దేశంలోకి చొరబడ్డారు. అలాంటి వారిపై క్రిమనల్ చర్యలు తీసుకోనున్నట్లు అమెరికా సృష్టం చేసింది. టెక్సాస్‌లోని ఓ చెక్ పాయింట్ వద్ద రిఫ్రిజిరేటర్ లాకర్లో సుమారు 78 మందిని అదుపు చేశారు. గతంలో భారత్‌లోని పంజాబ్‌కు చెందిన సుమారు వంద మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.













