భారత సంతతి ఆచార్యునికి అత్యున్నత పురస్కారం
ప్రఖ్యాత భారతీయ ఆస్ట్రేలియన్ గణిత శాస్త్రవేత్త అక్షయ్ వెంకటేశ్(36)కు గణితంలో నోబెల్ అనదగ్గ ఫీల్డ్స్ మెడల్ లభించింది. 40 ఏళ్ల లోపు గణిత శాస్త్రవేత్తల్లో అత్యంత ప్రతిభావంతులకు ఈ పతకాలను నాలుగేళ్లకోసారి ప్రకటిస్తుంటారు. రియో డి జనీరోలో జరిగిన అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల కాంగ్రెస్ లో ఆయనకు పతకం, ప్రశంసాపత్రం అందేశారు. ఢిల్లీలో పుట్టిన వెంకటేశ్ ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా ఉన్నారు. వెంకటేశ్‌తో పాలు మొత్తం నలుగురికి పతకాలు ప్రకటించారు. ఒక్కొక్కరికి 15 వేల కెనడా డాలర్ల (సుమారు 7.80 లక్షలు) నగదు పురస్కారం అందించారు. 13వ ఏటే 10వ తరగతి పూర్తి చేసిన వెంకటేశ్, ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి 16వ ఏటా గణితంలో డిగ్రీ, 20వ ఏట పీహెచ్డీ పూర్తి చేశారు. అనేక పురస్కారాలు పొందారు.













