అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు
గత నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా హ్యూస్టన్లో జరిగిన హౌడీ మోదీ సభలో పాల్గొన్నారు. ఆ సభకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానితులుగా వచ్చారు. అక్కడ సమవేశమైన ఇరు దేశాధినేతలు వాణిజ్యపరంగా ఒకరికొకరు సహకారం అందించుకుంటామని ప్రకటించారు. దీనిలో భాగంగానే అమెరికాకు చెందిన వస్తువులపై సుంకాన్ని తగ్గించాలని భారత్ నిర్ణయించుకుంది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువుల్లో ఎంపిక చేసిన వస్తువులపై సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. అక్టోబరు 21న జరిగే సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అమెరికాతో వాణిజ్య విభేదాలు నెలకొన్న తరుణంలో ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.













