ఫేస్ బుక్ వర్క్ ప్లేస్ చీఫ్ గా కరణ్‌దీప్ ఆనంద్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో కమ్యూనికేషన్ టూల్ వర్కుప్లేస్ చీఫ్‌గా భారత సంతతికి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ కరణ్‌దీప్ ఆనంద్‌కు పదోన్నతి కల్పించి ఆ విభాగానికి హెడ్‌ను చేసింది. ఇక ఆనంద్ విషయానికి వస్తే ఆయన 15 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌లో చేరారు. అటు తర్వాత నాలుగేళ్ల క్రితం ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ వర్క్‌ప్లేస్ లీడర్ జూలియన్ కోడిర్నియోతో కలిసి పనిచేశారు. వర్క్‌ప్లేస్ అనేది లండన్‌లో కూడా ఒక డివిజన్ ఉంది. కంపెనీకి చెందిన కమ్యూనికేషన్స్ టూల్స్, బిజినెస్ ఇక్కడి నుంచే జరుగుతాయి. కాగా ఆనంద్ విషయానికి వస్తే ఆయన వర్క్‌ప్లేస్ ప్రొడక్టు బృందం వీరిలో డెవలపర్లు, ఇంజినీర్లు, రీసెర్చర్లు, డేటా సైంటిస్టులు ఉంటారు. కోడోర్నియో విషయానికి వస్తే ఆయన సేల్స్, భాగస్వామ్యం విభాగాలకు ఇన్చార్జిగా యధావిధిగా కొనసాగుతారని ఫేస్బుక్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఫేస్బుక్లో ఆనంద్ ప్రొడక్టు హెడ్‌తో పాటు వివిధ విభాగాలు, వాటిలో మార్కెట్‌ప్లేస్, ఆడియెన్స్ నెట్వర్కు అండ్ యాడ్ సొల్యూషన్స్ అని తెలిపింది.













