అమెరికా డాక్టర్ కు 175 ఏళ్ల జైలు శిక్ష
జిమ్నాస్టిక్ క్రీడకు సంబంధించిన మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధించిన అమెరికా డాక్టర్ లారీ నసార్కు మిచిగన్ కోర్టు 175 ఏళ్ల జైలు శిక్షణను విధించింది. మెడికల్ ట్రీట్మెంట్ పేరుతో డాక్టర్ లారీ మహిళా అథ్లెట్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. వారిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కోర్టు అతనికి 40 నుంచి 175 ఏళ్ల వరకు జైలు జీవితాన్ని అనుభవించాలని కఠినమైన శిక్షను విధించింది. జైలు బయట మళ్లీ బ్రతికే ఛాన్సు నీకు లేదంటూ కోర్టు తన తీర్పులో వెల్లడించింది. ఒలింపిక్ స్వర్ణ విజేత జిమ్నాస్ట్ సైమోన్ బైల్స్, అలీ రైజ్మాన్, గ్యాబీ డగ్లస్, మెక్ కాలే మరోనే లాంటి అథెట్లు ఆ డాక్టర్ అకృత్యాలకు బలైనవారిలో ఉన్నారు. అయితే తనను క్షమించాలంటూ డాక్టర్ లారీ కోర్టును వేడుకున్నాడు. ఈ కేసులో సుమారు 160 మంది మహిళా అథ్టెట్లు విచారణకు హాజరయ్యారు. డాక్టర్ లారీ తమను వేధించారంటూ వారంతా కోర్టుకు విన్నవించారు. చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలపైన కూడా డాక్టర్ లారీకి 60 ఏళ్ల జైలు శిక్ష పడింది.













