గూగుల్ ఉపాధి కోర్సులు
నిరుద్యోగుల కోసం గూగుల్ సంస్థ ప్రత్యేక కోర్సులను ప్రారంభించనున్నది. గూగుల్ సర్టిఫికేషన్ కోర్సెస్ పేరిట వీటిని త్వరలోనే ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న కోర్సుల్లో 6 నెలలు శిక్షణ ఇచ్చి పరీక్ష ఆధారంగా ధ్రువప్రతాలను అందజేస్తారు. వీటిని సాధారణ డిగ్రీలుగా పరిగణిస్తామని గూగుల్ పేర్కొన్నది. ఈ కోర్సులతో నేరుగా గూగుల్లో ఉద్యోగం పొందవచ్చు. లేకపోతే ఇతర సంస్థల్లో చేరడానికి గూగుల్ సహాయం చేస్తుంది. కోర్సులు నేర్చుకోవడానికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. విద్యాసంస్థల్లో కాలం చెల్లిన సిలబస్ బోధిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో గూగుల్ ఈ కోర్సులను ప్రారంభిస్తున్నది. వీటితో సమయం కూడా ఆదా అవుతుందని తెలిపింది. అయితే ఈ కోర్సు ఫీజు ఎంత అన్నది మాత్రం వెల్లడించలేదు.













