గూగుల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
కరోనా మహమ్మారి నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగులకు అదనంగా ఒక రోజు సెలవు ఇవ్వడానికి నిర్ణయించింది. కోవిడ్ 19 సమయంలో వర్క్ ఫ్రం హోంతో ఇబ్బందిపడుతున్న ఉద్యోగులకు ఊరట నిచ్చేలా ఈ చర్యకు దిగింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేసేందుకు ఉద్యోగులకు గూగుల్ అవకాశం కల్పించినట్లు తెలిపింది. కోవిడ్ 19 మహమ్మారి ఏడవనెలలోకి ప్రవేశించిన తరుణంలో వారాంతానికి ముందు ఒక రోజు సెలవును అదనంగా ఉద్యోగులకు ఇస్తోంది. ఉద్యోగులందరి శ్రేయస్సు దృష్ట్యా సంస్థ శుక్రవారం కూడా సెలవుదినంగా ప్రకటించింది. ఇది ఉద్యోగులతో పాటు, ఇంటర్న్‌లకు కూడా వర్తిస్తుందని గూగుల్ వెల్లడించింది. ఈ సెలవును వార్షిక క్యాలెండర్‌ను జోడించమని కూడా సృష్టం చేసింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులకు మరొక రోజును వీక్ ఆఫ్‌గా గూగుల్ ప్రకటించింది. ఒక వేళ శుక్రవారం రోజు అత్యవసర పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తే వారు మరొక రోజు సెలవు తీసుకునే అవకాశం కల్పించింది. డే ఆఫ్‌ను కల్పించడంలో మేనేజర్లు తమ బృందం సభ్యులకు మద్దతుగా నిలవాలని కంపెనీ సూచించింది. 2021 మధ్య వరకు వర్క్ ఫ్రమ్ హోం వైపు మొగ్గు చూపుతూ సంబంధిత అవకాశాలను అన్వేషిస్తున్న తరుణంలో ఈ ఫోర్ డే వీక్‌ను కంపెనీ ప్రకటించింది.













