హెచ్-1బీ వీసాలకు దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త
హెచ్-1బీ వీసాలకు దరఖాస్తు చేసిన వారికి అమెరికా శుభవార్త చెప్పింది. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ వీసాలకు రెండో విడత లాటరీ పూర్తి చేశారు. అమెరికన్ సంస్థల్లో చేరే ప్రత్యేక నైపుణ్యాలు గల ఉద్యోగులకు హెచ్-1బీ వీసాలు జారీ చేస్తారు. ప్రధానంగా అమెరికన్ టెక్ కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలసంఖ్యలో ఉద్యోగులను ఈ వీసా ద్వారా నియమిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్-1బీ వీసాకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుంచి తగిన సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూఎస్ సిటిజెన్ షిప్, ఇమిగ్రేషన్ సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. అక్టోబరు ఒకటవ తేదీతో ప్రారంభమయ్యే ఈ ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసాలకు అర్హత సాధించిన వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.













