కరోనా టీకా ప్రయోగం విజయవంతం: అమెరికా
కరోనా వైరస్‌ను నిలువరించేందుకు అభివృద్ధి చేసిన టీకా తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో సత్ఫలితాలను ఇచ్చినట్లు అమెరికా ప్రకటించింది. ఆ టీకాను అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, మోడెర్నా సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. తొలి దశలో మార్చి నుంచి 45 మంది వాలంటీర్ల మీద ఈ టీకాను పరీక్షించామని పరిశోధకులు తెలిపారు. వారిలో రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు కరోనా వైరస్‌ను అడ్డుకునే యాంటీ బాడీలు విడుదలయ్యాయయని పరిశోధకులు వెల్లడించారు. వారిలో దుష్పరిణామాలు పెద్దగా కనిపించలేదని తెలిపారు. ఈ నెల 27 తర్వాత తదుపరి దశ ప్రయోగాలను 30 వేల మంది వాలంటీర్లపై నిర్వహించనున్నట్లు మోడెర్నా తెలిపింది.













