ఆ ప్రకటనలు నిషేధం : ఫేస్ బుక్
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సామాజిక మాధ్యమాల్లో జాతి విద్వేష, వేర్పాటువాదానికి సంబంధించిన అంశాలను ఇకపై అనుమతిచ్చేది లేదని ఆ సంస్థ ప్రతినిధులు తేల్చి చెప్పారు. ఇటీవల న్యూజిలాండ్ సంఘటన ద్వారా మేల్కొన్న ఫేస్బుక్ యాజమాన్యం ఇన్స్ట్రాగ్రామ్, ఫేస్బుక్లో పై అంశాలపై నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. జాతి గొప్పదనాన్ని చాటుకునేలా ప్రకటనలు ఉంటే వాటిని అనుమతిస్తామన్నారు. ఈ నిర్ణయం వారం రోజుల్లో అమలులోకి వస్తుందని తెలిపారు. కొన్ని రోజుల క్రితం న్యూజిలాండ్ మజీద్లపై శ్వేత జాతీయుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 50 మంది మరణించారు. ఉన్నాది మజీద్లపై దాడులకు పాల్పడుతూ దానికి సంబంధించిన వీడియోను ప్రత్యక్షంగా ఫేస్బుక్లో ప్రసారం చేశాడు. దీంతో ఫేస్బుక్పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. వెంటనే నివారణ చర్యలు చేపట్టిన ఫేస్బుక్ యాజమాన్యం విద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటనలపై నిషేధం విధించింది.













