ఫేస్ బుక్ లో మరో కొత్త ఫీచర్
ఫేస్బుక్ వాడకం ఈ మధ్య మామూలే అయిపోయింది. చాలా మంది ఈ సోషల్ నెట్‌వర్కింగ్‌ని ఎక్కువగా వాడుతుంటారు. ఇంత పాపులర్ అయిన ఫేస్బుక్ త్వరలో కొత్త ఫీచర్‌తో యూజర్లని ఆకట్టుకోనుంది. క్లియర్ హిస్టరీ పేరిట వచ్చే ఈ ఫీచర్‌తో అకౌంట్లోని బ్రౌజింగ్ హిస్టరీని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఫేస్బుక్లో ప్రైవసీ ఆప్షన్ ఉంది. అయితే ఇప్పుడు వచ్చే ఫీచర్‌తో యూజర్లకు మరింత మేలు జరుగుతుంది. వారి సమాచారం మేలు జరుగుతుంది. వారి సమాచారం మరింత సురక్షితంగా ఉంటుంది. దీంతో హ్యాకింగ్ జరిగే అవకాశమే ఉండదు. ప్రస్తుతం టెక్నికల్‌గా పరీక్షిస్తున్న నిపుణులు, దీనిని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.













