15 లక్షల వీడియోలను తొలగించిన ఫేస్ బుక్
న్యూజిలాండ్‌లోని రెండు మసీదులపై జరిగిన కాల్పుల ప్రత్యక్ష ప్రసారంపై విమర్శలు రావడంతో స్పందించిన ఫేస్బుక్ 15 లక్షల వీడియోలను తొలగించింది. క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదులపై దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరుపడమే కాక ఆ ఘటనను ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేసిన విషయం తెలిసిందే. దీన్ని పలువురు ఫేస్బుక్ ఖాతాదారులు తీవ్రంగా ఖండించారు. దీంతో స్పందించిన ఫేస్బుక్ భయానక కాల్పులకు సంబంధించిన 15 లక్షల వీడియోలను తొలగించింది. అప్‌లోడ్‌కు యత్నించిన 12 లక్షల వీడియోలను అడ్డుకుంది. న్యూజిలాండ్ కాల్పుల లైవ్‌ను నిరసిస్తూ ఏయిర్ ఏషియా గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండ్జ్ తన ఫేస్ బుక్ ఖాతాను స్తంభింపజేశారు. ఆయనకు 6.7 లక్షల మంది ఫేస్బుక్ ఫాలోవర్లు ఉన్నారు.













