లైంగిక బాధితులకు రూ.9 కోట్ల విరాళం : ఎమ్మా
ప్రముఖ హాలీవుడ్ నటి ఎమ్మా వాట్సన్ లైంగిక వేధింపులకు గురైన బాధితులకు అండగా నిలిచారు. లైంగిక బాధితుల సహాయార్థం ప్రారంభించిన యూకే జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఫండ్‌కు మిలియన్ ఫౌండ్లు (రూ.9 కోట్లకుపై చిలుకు) విరాళంగా ఇచ్చారు. దాదాపు 200 మందికిపైగా బ్రిటిష్, ఐరిష్ నటీమణులు వర్కింగ్ ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు స్వస్తి పలకాలంటూ బహిరంగ లేఖ రాసి, సంతకాలు చేశారు. వీరికి సాయం చేయడానికి ఈ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఎమ్మా థాంప్సన్, కేరీ ముల్లిగాన్, సాఇర్స్, రోనన్, గెమ్మా ఛాన్, కైరా నైట్లీ, తదితర నటీమణులు సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. విరాళం అందించిన తొలి దాత ఎమ్మా కావడం విశేషం.













