అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలి : ట్రంప్
నవంబరులో జరగాల్సిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రజలు సరిగ్గా, భద్రంగా, సురక్షితంగా ఓటు వేయగలిగేవరకు ఎన్నికలను వాయిదా వేయాలని ట్వీట్ చేశారు. మెయిన్-ఇన్ ఓటింగ్‌కు అనుమతి ఇస్తే ఎన్నికల్లో అవకతవకలు జరుగుతాయని, ఫలితాలు తారుమారు కావొచ్చని అన్నారు. అలా జరిగితే ఈ ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అవమానకరమైన సంఘటనగా మిగిలిపోతాయన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మెయిల్ ద్వారా ఓటేసే సదుపాయాన్ని కల్పించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. అయితే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి.













