హెచ్ -1బీ వీసాదారులకు గుడ్‌న్యూస్
హెచ్ -1బీ వీసాదారులకు ఊరట కలిగించే వార్త ఇది. సుమారు ఏడున్నర లక్షల మంది భారతీయులను అమెరికా నుంచి వెళ్లగొట్టేలా హెచ్-1బీ వీసాల పొడిగింపు చేయకూడదన్న తమ నిర్ణయంపై ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అలాంటి ఆలోచనేమీ తమకు లేదని సృష్టం చేసింది. గరిష్ఠంగా ఆరేళ్ల పాటు మాత్రమే అనుమతించేలా నిబంధనల్లో మార్పులు తీసుకొస్తున్నరన్న వార్తలు ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. హెచ్ 1బీ వీసా పరిమితిని ఆరేళ్లకు మించి పొడిగించేలా అనుమతిచ్చే సెక్షన్ 104 (సీ)కి మార్పులు చేసి, ఆ వీసాదారులకు అమెరికా విడిచి వెళ్లేలా చేసే ఉద్దేశం మాకు లేదు. ఒకవేళ అలా చేసిన వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే సెక్షన్ 106 (ఎ)-(బి) కింద ఎంప్లాయర్స్ ఏడాది చొప్పున పరిమితిని పెంచుకుంటే వెళ్లే అవకాశం ఉంటుందని అని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) మీడియా రిలేషన్స్ చీఫ్ జోనాథన్ వితింగ్టన్ సృష్టం చేశారు.
అధ్యక్షుడు జారీ చేసిన బయ్ అమెరికన్ హైర్ అమెరికన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమలు చేసేందుకు కొన్ని విధానపరమైన మార్పులు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే పరిమితి పూర్తయి, గ్రీన్‌కార్డుల కోస వేచి చూస్తున్న లక్షలాది మంది ఇండియన్స్ ఇది కచ్ఛితంగా ఊరట కలిగించే విషయమే. ఈ ప్రకటనకు ముందే ఇమిగ్రేషన్ వాయిస్ గ్రూప్ తాము విజయం సాధించినట్లు తమ ఫేస్బుక్ పేజీలో ప్రకటించింది. హెచ్ 1 బీకి సంబంధించి యూఎస్సీఐఎస్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఈ గ్రూప్ సృష్టం చేసింది.













