సీఐఏ హెచ్చరికలను పట్టించుకోని డొనాల్డ్ ట్రంప్
చైనాలో కరోనా వ్యాప్తి, తమ దేశంపై అది చూపే ప్రభావం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అప్రమత్తం చేస్తూ అమెరికా నిఘా సంస్థ సీఐఏ పదేపదే హెచ్చరికలు చేసినా ఆయన పెడచెవిన పెట్టారా? దాదాపు 12 సార్లు హెచ్చరికలు చేసిన ట్రంప్ వాటిని పట్టించుకోలేదని తెలిసింది. అత్యంత ప్రాముఖ్యం గల ప్రపంచ పరిణామాలు, భద్రతా ప్రమాదాలపై అధ్యక్షుడికి సమర్పించే నివేదికల్లో భాగంగా చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి సీఐఏ అధికారులు జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనే ట్రంప్ దృష్టికి తెచ్చినా ఆయన నిర్లక్ష్యం చేశారని తెలిసింది. తమకు సమాచారం ఇచ్చిన సీఐఏకి చెందిన కొందరు ప్రస్తుత, మాజీ అధికారుల పేర్లను మాత్రం వెల్లడించలేదు.













