ఆల్బని ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ
ఆల్బని ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో కొండపల్లిలోని గర్ల్స్ హైస్కూల్ లోని బాలికలకు 10 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. వీటిని విద్యార్థినులకు చక్కగా వినియోగిస్తున్నారని, అందుకు తాము చాలా సంతోషిస్తున్నామని ఆల్బని ఆంధ్ర సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
అలాగే ఆల్బని ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలోనే అక్షయ శక్తి అన్న పథకంలో భాగంగా అక్షయ ధాక సహకారంతో 20 మంది మహిళలకు కూడా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అలాగే తరగతుల నిర్వాహణ కోసం నిధులు కూడా సమకూర్చారు. ఈ మోత్తం నిధులను AAA అందించింది. మూడు నెలల పాటు కుట్టు మిషన్ల శిక్షణను వీరు నిర్వహించారు. కొత్తగా పొందిన ఈ నైపుణ్యాలు, విద్యార్థినులకు కుట్టుపనిలో వృత్తిని చేపట్టడానికి మరియు జీవనోపాధి పొందడానికి ఒక ముందడుగు వేయడానికి సహాయపడుతుందని ఆల్బని ఆంధ్ర సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు.









