అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ గా నాన్సీ పెలోసీ
అమెరికా ప్రజా ప్రతినిధుల సభ స్పీకర్గా మైనారిటీ నేత నాన్సీ పెలోసీని డెమోక్రాట్లు నామినేట్ చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో 203-32 ఓట్లతో పెలోసిని ఎన్నుకున్నారు. స్పీకర్గా ఎన్నికవడంలో ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కొనప్పటికీ కొంతమంది డెమోక్రాట్ల నుంచే విముఖత ఎదురైంది. కొత్త నాయకత్వం కావాలని కొత్తగా వచ్చిన సభ్యులు కొందరు భావించారు. పెలోసిని వ్యతిరేకిస్తూ అధికారికంగా 16 మందవి సభ్యులు ఒక లేఖ రాశారు. అయితే తర్వాత కొంతమంది పెలోసికి మద్దతివ్వడానికి అంగీకరించారు. జనవరిలో స్పీకర్ పదవికి తుది ఓటింగ్ జరిగే సమయంలో ఆమె తీవ్ర సవాలును ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ సమయంలో ఆమె గెలుపొందాలంటే 218 ఓట్లు అవసరమవుతాయి.













