స్టార్టప్ వీసాల వాయిదా
స్టార్టప్ కంపెనీలను స్థాపించి నిర్వహించే విదేశీయులకు అమెరికాలో నివాస హక్కులు కల్పించే వీసా కార్యక్రమం ప్రారంభాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేయడంతో భారతీయ పారిశ్రామికుల పరిస్థితి గందరగోళంలో పడింది. ఒరాక్ ఒబామా సర్కారు గత ఏడాది జనవరిలో ఆమోదించిన ఈ కార్యక్రమాన్ని స్టార్టప్ వీసా అని పిలుస్తున్నారు. ఈ నెల 17 నుంచి ఈ కార్యక్రమం అమలులోకి రావాల్సి ఉండగా ట్రంప్ సర్కారు దానిని వాయిదా వేసింది. అమెరికాకు చెందిన స్టార్టప్‌లలో సగాని పైగా వలస వచ్చిన ప్రజలు ప్రారంభించినవే. 30 శాతం వరకు భారతీయులు ప్రారంభించినవే ఉన్నాయి. వాటి విలువ 100 కోట్లు డాలర్ల కంటే ఎక్కువే ఉంటుంది. అవి అమెరికన్లకు ఉపాధి కల్పిస్తాయని, ఆర్థిక వ్వవస్థను వృద్ధి చేస్తాయని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ అనే అధ్యయన సంస్థ తెలిపింది. ట్రంప్ సర్కారు నిర్ణయాన్ని మతిలేని చర్యగా అభివర్ణించిన భారత-అమెరికన్ పారిశ్రామికవేత్త వివేక్ వాధ్యా, కార్యక్రమాన్ని వాయిదా వేయడం వల్ల ఎవరికీ ఒరిగేదేమీ లేదని తెలిపారు.













