చాక్లెట్ ప్రియులకు శుభవార్త!
చాక్లెట్ ప్రియులకు శుభవార్త. ముదురు గోధమ వర్ణపు చాక్లెట్లు మెదడుకు మేలుచేస్తాయని తాజా పరిశోధన చెబుతోంది. వయసు పైబడటంతో సంక్రమించే ఒత్తిడి, వాపుల నుంచి రక్షణ కల్పించడంతో ప్రధాన పాత్ర పోషిస్తాయని వివరిస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు. చాక్లెట్లలో కనిపించే ఎపికాటెచిన్ (ఈపీఐ) ఫ్లేవనాల్పై వారు దృష్టి కేంద్రీకరించారు. రెండు వారాలపాటు దీన్ని తీసుకుంటే ఒత్తిడి, వాపు తగ్గుతాయని గుర్తించారు. దీంతో అల్జీమర్స్, ఇతర నాడీ సంబంధిత రుగ్మతల ముప్పులను నియంత్రించుకోవచ్చని వారు తెలిపారు. అంతేకాదు ఈపీఐతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని, ఆందోళన తగ్గుతుందని వివరించారు. ఎలుక ప్లిలలపై పరిశోధన చేపట్టిన అనంతరం తాము తాజా అవగాహనకు వచ్చామన్నారు.













