హాస్పిటల్లోనే పెళ్లి.. ఎందుకో తెలుసా!
ఏ యువతి, యువకుడైనా తమ వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కలలు కంటారు. ఖరీదైన ఫంక్షన్ హాల్లో బంధువుల మధ్య పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ఓ జంట మాత్రం అందుకు భిన్నంగా హాస్పిటల్లో పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే.. తన తండ్రిపై ఆ యువకుడికి ఉన్న ప్రేమ. టెక్సాస్‌కు చెందిన మిచెల్ థాంప్సన్, ఆలియా పెళ్లి సమయం నాటికి మిచెల్ తండ్రి విలియం థాంప్సన్ ఆస్పత్రి పాలయ్యాడు. విలియంకు సర్జరీ చేయడంలో ఆయన బయటకు రాలేని పరిస్థితి. పెళ్లి సమయం కూడా వచ్చేసింది.
తండ్రి కళ్లెదుటే పెళ్లి చేసుకోవాలనుకున్న మిచెల్.. తన తండ్రి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లాడు. తండ్రి సమక్షంలో తన ప్రియురాలు ఆలియాకు రింగ్ తొడిగారు. ఆమె కూడా మిచెల్‌కు రింగ్ తొడిగింది. ఇలా తండ్రి విలియం, వైద్యులు, నర్సుల మధ్య మిచెల్, ఆలియా ఒక్కటయ్యారు. తండ్రి సమక్షంలో రింగ్‌లు మార్చుకున్న ఈ జంట.. ఒరిజనల్ ప్లాన్ ప్రకారం చర్చిలో కూడా పెళ్లి చేసుకున్నారు. ఇక నర్సులు ఈ జంటకు సర్ప్రైజ్ ఇచ్చారు. గ్రేప్ జ్యూస్ కొంత జంటకు ఇచ్చి పుష్పగుచ్ఛాలతో అభినందించారు. కేక్ కట్ చేశారు.













