అమెరికాలో కోవిడ్ మరణాలు పెరుగుతాయా?
అమెరికా ప్రస్తుతం కోవిడ్ 19 వైరస్‌తో అతలాకుతలమవుతోంది. ఎక్కడ చూసినా ఈ వైరస్ కారణంగా ప్రజలు మనశ్శాంతిగా ఉండటం లేదు. మరోవైపు పెద్ద పెద్ద సంస్థలు లాక్డౌన్ ప్రకటించాయి. దానికితోడు ఈ వైరస్ పెద్ద ఎత్తున విస్త•తంగా వ్యాపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే నాలుగు నెలల్లో వైరస్ బారిన పడి అమెరికా వ్యాప్తంగా దాదాపు 81 వేల మంది మరణించే అవకాశం ఉందని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ చేసిన సర్వేలో తేలింది. అది జూన్‌లోగానే జరిగే అవకాశం కూడా ఉందని వెల్లడైంది. ఏప్రిల్ రెండో వారానికంతా ఆసుపత్రిపాలయ్యేవారి సంఖ్య అధికంగా ఉంటుందని, జులై నెలలో కూడా వైరస్ మరణాలు కొనసాగుతాయని తేలింది. జూన్ నెల తర్వాత ప్రతినిత్యం దాదాపు 10 మంది దాకా మరణించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. కాలిఫోర్నియాలో వైరస్ చాలా నిదానంగా విస్తరిస్తోందని, రానున్న రోజుల్లో వైరస్ బాధితుల సంఖ్య అక్కడ అధికంగా ఉండొచ్చని అభిప్రాయపడింది.
ప్రస్తుతం వైరస్ బాధితుల సంఖ్య లక్షను దాటింది. నిన్న ఒక్కరోజే 16 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1300 మంది మ•త్యువాత పడ్డారు. 40, 50 ఏళ్ల వయసులో ఉన్న వారు ఎక్కువగా మరణించడంపై అమెరికా ప్రజలలో ఆందోళన మొదలైంది. అయితే ప్రజలెవరూ రక్షణ చర్యలు చేపట్టడం లేదని, చేతులు శుభ్రంగా కడుక్కోవడం లేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.













