అమెరికాలో కరోనా మామూలుగా లేదు…
కరోనా వైరస్ అమెరికాలో సాధారణంగా కనిపించడం లేదు. పూర్తి ప్రతాపాన్ని చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ తో అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏ ఒక్క వర్గాన్ని, రంగాన్నీ వదలకుండా యూఎస్‌పై విలయతాండవం చేస్తోంది. శుక్రవారం ఉదయం నాటికి అందిన సమాచారం ప్రకారం అ దేశంలో కరోనా కేసుల సంఖ్య 85,594కు చేరి చైనాను అధిగమించింది. అలాగే 1,300 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో గురువారం ఒక్కరోజే 17వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక వాణిజ్య రాజధానిగా పేరొందిన న్యూయార్క్‌లో వైరస్ తీవ్రత రోజురోజుకూ విజ•భింస్తోంది. మరోవైపు వైరస్‌ను కట్టడిచేయడంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి ఉంటుందని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు.













