వాణిజ్య పోరు మరో కీలక మలుపు …
అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న ఈ కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వాణిజ్య పోరు మరో కీలక మలుపు తీసుకుంది. ఇంతవరకు తమ సంస్థలపై నిషేధం విధిస్తూ వస్తున్న అగ్రరాజ్యానికి తగిన జవాబు ఇచ్చేందుకు చైనా సిద్ధమైంది. హువాయి తదితర సంస్థలు, టిక్‌టాక్ వంటి యాప్‌లపై పలు ఆంక్షలు విధించిన అమెరికా నిర్ణయానికి ప్రతిచర్యగా చైనా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో నమ్మదగని సంస్థలు జాబితాను సిద్ధం చేస్తున్నామంటూ చైనా ప్రకటించింది.
ఆ దేశ వాణిజ్య శాఖ చేసిన ప్రకటనలో ప్రత్యేకించి ఏ విదేశీ సంస్థ ప్రస్తావన లేనప్పటికీ వీటిలో విదేశాలకు చెందిన సంస్థలు, వ్యక్తులు, ఇతర కార్యాలయాలు కూడా ఉండవచ్చని ప్రకటించింది. ఆయా సంస్థలపై తీసుకునే చర్యలలో జరిమానాలు మాత్రమే కాకుండా విదేశీ వాణిజ్యం, చైనాలో పెట్టుబడులు, సిబ్బంది పరికరాల ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు తదితర అంశాలు ఉండవచ్చని ఆ శాఖ ప్రకటించింది. నిబంధనల అతిక్రమణకు పాల్పడినట్టు తెలిస్తే ప్రభుత్వం ఆ సంస్థపై విచారణకు ఆదేశిస్తుందని తెలిపింది. అది విదేశీ సంస్థ అయితే దానికి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇస్తామని కూడా చైనా వివరించింది.













