ఉపాధ్యక్ష పదవికి బెర్నీ శాండర్స్ !
అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బెర్నీ శాండర్స్ ను తీసుకోనున్నట్లు మాజీ ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ సూచాయగా వెల్లడించారు. నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను సవాల్ చేసే డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం బిడెన్, శాండర్స్ తీవ్రంగా పోటీపడుతున్నారు. అత్యధిక ప్రైమరీస్, కాకసన్లను చేజిక్కించుకున్న బిడెన్‌కే డెమొక్రటిక్ పార్టీ నామినేషన్ లభించే అవకాశాలున్నాయి. ఈ పోటీలో తుది దాకా బరిలో నిలిచిన శాండర్స్ అధ్యక్ష ఎన్నికల్లో తన రనింగ్మేట్గా ఉంటారని బిడెన్ సూచనప్రాయంగా తెలిపారు. అయితే డెమొక్రాటిక్ పార్టీ సెలక్షన్ కమిటీ దీనికి ఆమోదం తెలిపాల్సి ఉంది. తాను, తన పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవికి, మంత్రివర్గసభ్యులను ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ వచ్చే నెలలో సమావేశం కానుంది. తన ఎన్నికల ప్రచారం కోసం నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా దాతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బిడెన్ ఈ సంగతి వెల్లడించారు.













