భారత్ లో మరో రెండు కాన్సులేట్లు : అమెరికా
భారత్‌లో మరో రెండు కాన్సులేట్లను ఆరంభించాలని అమెరికా నిర్ణయించింది. వాటిని బెంగళూరు, అహ్మదాబాద్‌లలో ఏర్పాటు చేయనున్నామని అమెరికా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. భారత్ సియాటెల్‌లో కాన్సులేట్‌ను ఆరంభిస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ ప్రకటన వెలువడిరది. ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్ రాయబార కార్యాలయంతో పాటు ఐదు చోట్ల ( న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో, హ్యూస్టన్, అట్లాంటా) భారత కాన్సులేట్లు ఉన్నాయి. భారత్‌లో అమెరికాకు ఢిల్లీలోని రాయబార కార్యాలయంతో పాటు ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌లలో కాన్సులేట్లు ఉన్నాయి.













