తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఆధ్వర్యంలో అక్టోబర్ 18 న బతుకమ్మ సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (TAGC) ఆధ్వర్యంలో 𝐓𝐀𝐆𝐂 𝐁𝐀𝐓𝐇𝐔𝐊𝐀𝐌𝐌𝐀 𝐏𝐀𝐍𝐃𝐔𝐆𝐀 𝟐𝟎𝟐𝟔’’ పేరుతో వైభవంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 18 వ తేదీన ఉదయం 11:30 నిమిషాల నుంచి ఈ బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతాయి. సుప్పయ్య హాల్, SVS బాలాజీ టెంపుల్1145 సుల్లివన్ Rd, అరోరా, IL 60506 లో బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. అయితే బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేవారు కచ్చితంగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. అంతేకాకుండా బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేవారు చీర ధరించి రావాలని కూడా సూచించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గాయని స్ఫూర్తి జితేందర్ హాజరవుతున్నారు. బతుకమ్మ పాటలను, మ్యూజిక్ పాటలను పాడనుంది. ఈ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:00 గంట వరకు భోజన సదుపాయం కూడా వుంటుంది.
అలాగే బతుకమ్మ బహుమతులను కూడా అందజేయనున్నారు. ‘‘బెస్ట్ బతుకమ్మ’’ కింద ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కూడా ప్రదానం చేయనున్నారు.
రాఫిల్ బహుమతుల కేటగిరీ కింద 1.5 CTW డైమండ్ స్టడ్స్ (చెవిపోగులు) ఒక జత, 1 CTW డైమండ్ స్టడ్స్ రెండు జతలు,1 గ్రాము బంగారు నాణేలు మూడు ప్రదానం చేయనున్నారు.
కార్యక్రమ వివరాలివీ …
తేదీ : అక్టోబర్ 18,2026
సమయం : ఉదయం 11:30 నిమిషాల నుంచి ప్రారంభం
వేదిక : సుప్పయ్య హాల్, SVS బాలాజీ టెంపుల్
1145 సుల్లివన్ Rd, అరోరా, IL 60506 (Suppiah Hall, SVS Balaji Temple
1145 Sullivan Rd, Aurora, IL 60506)
ఆకర్షణలు :
ప్రఖ్యాత సింగర్ స్ఫూర్తి జితేందర్ కార్యక్రమాలు
నళిని పాదం డ్యాన్స్ స్కూల్ వారిచే కోలాటం
నరసింహ రెడ్డి ఫోటోగ్రఫీ
చీరలు ధరించి బతుకమ్మ సంబరాలకు రావడం
బెస్ట్ బతుకమ్మ కింద మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు
రాఫెల్ ప్రైజెస్ కింద రాఫిల్ బహుమతుల కేటగిరీ కింద 1.5 CTW డైమండ్ స్టడ్స్ (చెవిపోగులు) ఒక జత, 1 CTW డైమండ్ స్టడ్స్ రెండు జతలు,1 గ్రాము బంగారు నాణేలు
లంచ్ : మధ్యాహ్నం 12 నుంచి 1:00 గంట వరకు
పాల్గొనే వారు పోస్టర్ లోని లింక్ ద్వారా ముందుగానే పేర్లను నమోదు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు బతుకమ్మ చైర్మన్ మాధవి రాణి కొనకల్ల (224-432-9092, కో చైర్మన్ రమ్య నాగులవంచ (571-438-3461), రచన కోలుగూరి (469-305-6245), శైలజ బేతి (630-539-6245), అధ్యక్షులు అర్చన పొద్దుటూరి (630-849-9135) సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమానికి మాధవి రాణి కొణకల్ల నాయకత్వం వహిస్తున్నారు.








