న్యూజిలాండ్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
విదేశాల్లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను వైభవంగా జరిపారు. మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయ బతుకమ్మ పాటలతో ప్రాంగణం హోరెత్తింది. ఈ సందర్భంగా అందమైన బతుకమ్మ పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం తెలంగాణ వంటకాలతో విందు ఇచ్చారు. న్యూజిలాండ్ తెలంగాణ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నరేంద్ర రెడ్డి, ఎం. ప్రసన్నకుమార్, కార్యదర్శి కోడూరి చందు, సంయుక్త కార్యదర్శి లోక రాజ్‌కుమార్ రెడ్డి, ప్రతినిధులు శైలేందర్ రెడ్డి, విజయలక్ష్మీ, విజేత తదితరులు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.













