ATA: పీవాకీ హిందూ దేవాలయంలో తెలుగు పండుగ.. మార్చి 22న ఆటా ఉగాది వేడుకలు!
ATA: అమెరికా తెలుగు సంఘం (ATA) విస్కాన్సిన్ చాప్టర్ ఆధ్వర్యంలో తెలుగు నూతన సంవత్సర ‘ఉగాది’ , ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ వేడుకలను సంయుక్తంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. స్థానిక పీవాకీ (Pewaukee) నగరంలోని హిందూ టెంపుల్ ఆఫ్ విస్కాన్సిన్లో ఈ వేడుకలు జరగనున్నాయి.
కార్యక్రమ వివరాలు:
- తేదీ: 2026, మార్చి 22 (ఆదివారం).
- సమయం: ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు.
- వేదిక: Hindu Temple of Wisconsin, Pewaukee.
ముఖ్య విశేషాలు: సాంస్కృతిక ప్రదర్శనలు, ఉగాది పచ్చడి పోటీలు, లక్కీ డ్రా (వెండి నాణేలు , సర్ప్రైజ్ గిఫ్ట్స్) ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. హాజరైన వారందరికీ విందు భోజనం (Lunch) వడ్డించబడుతుంది.
రిజిస్ట్రేషన్ వివరాలు:
ATA సభ్యులు: పెద్దలకు $10, పిల్లలకు $5.
సభ్యులు కాని వారు: పెద్దలకు $15, పిల్లలకు $10.
నిర్వాహక , కార్యవర్గ బృందం:
ఈ వేడుకలను ATA Wisconsin Leads , ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు:
లీడ్స్: పోలి రెడ్డి, చంద్ర మౌళి, వెంకట్ జలారి, జయంత్ పారా, కరుణాకర్ రెడ్డి, సింధు నేతి, సంతోషి వల్లూరి.
ప్రెసిడెంట్: జయంత్ చల్లా.
కమిటీ సభ్యులు: సతీష్ రామసహాయం రెడ్డి, మధు బొమ్మినేని, సాయినాథ్ బోయపల్లి, శ్రీకాంత్ గుడిపాటి, శారద సింగిరెడ్డి, విజయ్ తుపాళ్ళ, నర్సిరెడ్డి గడ్డికొప్పుల, అరవింద్ రెడ్డి ముప్పిడి.
జులై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ఆటా కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ కు సన్నాహకంగా ఈ ప్రాంతీయ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.








