ఘనంగా కొనసాగుతున్న ఆటా ఝుమ్మంది నాదం పాటల పోటీలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) “ఝుమ్మంది నాదం” పాటల పోటీలను జూన్ 28, 2020 నుండి ఆగష్టు 2, 2020 వరకు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఆదివారం జూన్ 28, 2020 సబ్ జూనియర్స్ నాన్ క్లాసికల్, జులై 4, 5 తేదీలలో జూనియర్స్ నాన్ క్లాసికల్ పాటల పోటీలను ఆన్ లైన్ లో జూమ్ ద్వారా నిర్వహించారు. దాదాపుగా 82 మంది గాయని గాయకులు అమెరికా లో పలు రాష్ట్రాలనుండి ఆసక్తితో పాల్గొన్నారు. శ్రీ. రామ క్రిష్ణా రెడ్డి ఆల బోర్డు అఫ్ ట్రస్టీ, శ్రీమతి.శారదా సింగిరెడ్డి ఝుమ్మంది నాదం చైర్ కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించారు.
అమెరికా మరియు ఇండియా నుండి కర్నాటిక్ మ్యుసిషియన్ శ్రీ. వాసగోపినాధ్ రావు, సంగీత దర్శకులు శ్రీ.శ్రీని ప్రభల, సంగీత దర్శకులు శ్రీ.రాజ శేఖర్ సూరిభొట్ల, ప్లే బ్యాక్ సింగర్ మరియు సంగీత దర్శకులు శ్రీ. నిహాల్ కొండూరి, ప్లే బ్యాక్ సింగర్ శ్రీ నూతన మోహన్, ప్లే బ్యాక్ సింగర్ శ్రీ..మానస ఆచార్య, ప్లే బ్యాక్ సింగర్ శ్రీ ప్రవీణ్ కుమార్ కొప్పోలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
ఆటా సంస్థ కలిగి ఉన్న అయిదు రీజియన్స్ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, మిడ్ వెస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ ల నుండి సబ్ జూనియర్స్ నాన్ క్లాసికల్ కేటగిరి గాయనీమణులు ..అమ్రిత వుడుముల, అనన్య జొన్నాదుల, అనన్య యెర గుడిపాటి, కృతి రాచకొండ, మహి ఓత్ర, మిత్ర చెబియం. పర్ణిక వుల్లగంటి, శరణ్య ఎస్, తన్వి గొంగల, వైష్ణవి రెండుచింతల “ఫైనలిస్ట్స్ గా” ఎంపిక చేసారు.
ఆటా ప్రెసిడెంట్ శ్రీ..పరమేష్ భీం రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ. భువనేశ్ రెడ్డి భుజాల, బోర్డు అఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ చైర్స్, రీజినల్ కోఆర్డినేటర్స్, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ మరియు కాన్ఫరెన్స్ టీం, ఝుమ్మంది నాదం టీం మరియు, సోషల్ మీడియా టీం అమెరికా లో ఉన్న గాయని గాయకుల నైపుణ్యతను ప్రదర్శించడానికి ఆటా సంస్థ ఏర్పరచిన ఈ గొప్ప సదవకాశాన్ని ఉపయోగించుకొని సంగీత విద్వాంసుల ముందు వారి సంగీత ప్రతిభను చూపిస్తున్న గాయని గాయకులందరికి అభినందనలు తెలియ పరిచారు.
ఆటా సంస్థ లైవ్ ప్రచారం చేస్తున్న మన టీవి, మన టీవి ఇంటర్నేషనల్, టీవి 5, జి .యెన్. యెన్, ఏ. బి. ర్ ప్రొడక్షన్స్, అలాగే తెలుగు యెన్.ఆర్.ఐ రేడియో, టోరీ రేడియో మీడియా మిత్రులందరికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఝుమ్మంది నాదం పాటల పోటి విజయవంతానికి కృషి చేసిన ఆటా కార్యవర్గ బృందానికి ఆటా ప్రెసిడెంట్ శ్రీ .పరమేష్ భీంరెడ్డి ప్రశంసలను తెలిపారు.













