డొనాల్డ్ ట్రంప్ కు అమెరికన్ల మద్దతు
ఉత్తర కొరియాతో సంబంధాల పునరుద్ధరణకు ట్రంప్ చూపిన చొరవకు మెజార్టీ అమెరికన్లు మద్దతు ప్రకటించారు. సింగపూర్ వేదికగా కిమ్‌తో జరిపిన చర్చలు ట్రంప్ దార్శనికతకు నిదర్శనంగా అభివర్ణించారు. అయితే, అణునిరాయుధీకరణకు కిమ్ కట్టుబడి వుంటారన్న నమ్మకం లేదన్న సందేహాన్ని అమెరికన్లు లేవనెత్తారు. అసోసియేటెడ్ ప్రెసె సర్వే ఫలితాలను నార్క్ సెంటర్ పబ్లిక్ ఎఫైర్స్ రీసెర్చ్ విడుదల చేసింది. దీని ప్రకారం 55శాతం మంది అమెరికన్లు ఉత్తర కొరియా పట్ల ట్రంప్ నిర్వర్తించిన దైత్యచర్యలను స్వాగతించారు. ఇదే అంశంపై గతేడాది అక్టోబర్‌లో 34శాతం మంది ట్రంప్‌ను సమర్థించారు. మార్చినాటికి ఇది 42శాతానికి చేరింది. కాగా నార్కోపోల్ ఆవిర్భావం నుండి ఒకే అంశంపై రిపబ్లికన్ అధ్యక్షుడికి ఈ స్థాయిలో మద్దతు లభించడం ఇదే ప్రథమం కావడం విశేషం.













