AIA: కాలిఫోర్నియాలో ఘనంగా ‘హోలీ’ జరుపుకున్న ఏఐఏ
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA), బాలీ 92.3 సంయుక్తంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘనంగా ‘హోలీ’ సంబరాలు నిర్వహించాయి. శాన్ జోస్ డౌన్టౌన్లో ఉత్సాహవంతంగా జరిగిన ఈ వేడుకలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగాయి. మొత్తమ్మీద 15 వేల మంది వరకు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రాండ్ స్పాన్సర్ సంజీవ్ గుప్తా సీపీఏ, ప్లాటినం స్పాన్సర్ రియల్టర్ లావణ్య దువ్వి, ట్రావెల్ పార్టనర్ ట్రావెలపాడ్, రియల్టర్ నాగరాజ్ అన్నయ్య, మంత్ర ఇండియా, ఫుడ్ స్పాన్సర్ చాట్ భవన్ సహకారంతో ఈ రంగుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ వేడుకలకు విచ్చేసిన వారంతా సంతోషంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా రాకేష్ అడ్లఖ, శాన్ జోస్ మేయర్ మ్యాట్ మహన్, సన్నీవేల్ మేయర్ ల్యారీ క్లెయిన్, ఫ్రెమాంట్ మేయర్ రాజ్ స్వాన్, వాన్ జోస్ కౌన్సిల్మెంబర్స్ డొమింగో కాండెలాస్, బెయిన్ డోన్, శాంటా క్లారా కౌన్సిల్మెంబర్ కెవిన్ పార్క్, శాన్ జోస్ పోలీస్ చీఫ్ పాల్ జోసెఫ్ అండ్ టీం, లాస్ ఆల్టో వౌస్ మేయర్ నేసా ఫ్లిగోర్, పాలో ఆల్టో వైస్ మేయర్ విక్కి వీన్కర్, శాన్ జోస్ డౌన్టౌన్ అసోసియేషన్ సీఈవో అలెక్స్ స్టెట్టిన్స్కీ, సిలికాన్ వ్యాలీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈవో హర్బీర్ భాటియా, కాంగ్రెస్మ్యాన్ శామ్ లికార్డో రిప్రజంటేటివ్స్, కాంగ్రెస్మ్యాన్ రో ఖన్నా, సూపర్వైజర్ ఓటీటీ లీ, సూపర్ వైజర్ సిల్వియా ఆరెనాస్, అసెంబ్లీ సభ్యులు అలెక్స్ లీ, మార్క్ బెర్మాన్ తదితర ప్రముఖులు కూడా ఈ హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్న ఏఐఏ కృషిని మెచ్చుకున్నారు. 50కి పైగా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ల ప్రతినిధులు తీవ్రంగా శ్రమించి ఈ వేడుకలు జయప్రదం కావడంలో ఏఐఏకి సహకారం అందజేశారు. వీరికి, అలాగే స్పాన్సర్లకు, వాలంటీర్లకు, అందరికీ ఏఐఏ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.







