అమెరికాకు అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా?
అమెరికాకు అతిపెద్ద శత్రువు ఎవరో కాదు. మీడియా రాసే ఫేక్ న్యూసేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో చరిత్రాత్మక భేటీ గురించి అమెరికా మీడియా తప్పుడు వార్తలు వెలువరించిందంటూ ట్రంప్ మండిపడ్డారు. కిమ్‌తో భేటీ ముగిసిన తర్వాత సింగపూర్ నుంచి అమెరికా తిరిగి రాగానే ట్విట్టర్ వేదికగా మీడియాపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కిమ్‌తో జరిగిన ఒప్పందాన్ని తక్కువ చేసి చూపించేందుకు ఎన్బీసీ, సీఎన్ఎన్ వంటి సంస్థలు తప్పుడు వార్తలు రాయడం చూస్తుంటే నవ్వొస్తున్నదని పేర్కొన్నారు.













