11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు: 3వ ప్రకటన (ఆఖరి ప్రకటన)
దొరకునా ఇటువంటి సేవా!
10 రోజులలో ఫ్లారిడా రాష్ట్ఱ చరిత్రలో, ఓర్లాండో నగరం లో తెలుగు సాహిత్య ప్రభంజనం-వినోద భరితం-విజ్ఞాన దాయకం
నవంబర్ 2-3. 2019
అందరూ ఆహ్వానితులే
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఓర్లాండో మహానగర తెలుగు సంఘం వారి సంయుక్త నిర్వహణలో రాబోయే నవంబర్ 2-3, 2019 తేదీలలొ ఓర్లాండో మహా నగరం లో జరుగుతున్న 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సుకు అందరూ ఆహ్వానితులే. పూర్తి వివరాలతో మా 3వ ప్రకటన -ఆఖరి ప్రకటన ఇందుతో జతపరిచాం.
ఈ సదస్సు గురించి క్లుప్తంగా:
1. ఫ్లారిడా రాష్త్రంలో, అందునా ఓర్లాండో మహా నగరం లో కేవలం తెలుగు భాషా, సాహిత్యాలకి మాత్రమే పెద్ద పీట వేసి రెండు రోజుల పాటు నిర్వహించబడే జాతీయ స్థాయి సాహిత్య సాహితీ సదస్సు.
2. మా ఆహ్వానం మీద మొట్టమొదటి సారిగా అమెరికా వస్తున్నయువ శతావధాని, అవధాన భీమ, అవధాన సుధాకర, అవధాన భారతి బిరుదాంకితులు డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ (విశాఖ పట్నం), ప్రముఖ రచయిత, బ్లాగర్, పత్రికా సంపాదకురాలు, ధారావాహికల రచయిత్రి, తెలంగాణా వంటల మీద దేశవ్యాప్తంగా గుర్తింపు, తెలంగాణాలో బహుశా ఏకైక మహిళా ప్రచురణ కర్త గా తెలంగాణ ప్రభుత్వపు విశిష్టమహిళ 2019 పురస్కార గ్రహీత శ్రీమతి జ్యోతి వలబోజు గారు, మరొక ప్రముఖ భారత దేశ సాహితీ వేత్తలు మా ఆహ్వానిత అతిధులుగా ఓర్లాండో విచ్చేస్తున్నారు.
3. ఫ్లారిడా నలుమూలల నుండే కాక అనేక మంది టెక్సస్, ఇలినాయ్, మేసచ్యుసెట్స్, మిస్సోరి, కాలిఫోర్నియా, ఒహాయో, సౌత్ కెరొలైనా, మిషిగన్, న్యూ జెర్శీ మొదలైన ఇతర రాష్త్రాల అమెరికా రచయితలు, సాహితీవేత్తలు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అనేక మంది ఔత్సాహిక యువ రచయితలు ఈ సదస్సులో పాల్గొనడం ఒక ప్రత్యేకత.
4. అమెరికాలో అత్యధిక సంఖ్యలో కథలు వ్రాసిన ప్రముఖ అమెరికా సాహితీ వేత్త`శ్రీ సత్యం మందపాటి & విమల (ఆస్టిన్) దంపతులకి జీవన సాఫల్య పురస్కార ప్రదానం జరుగుతుంది.
5. అమెరికా తెలుగు కథానిక -14వ సంకలనంతో సహా9 వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి తాజా ప్రచురణలు, ఇతర సంస్థల ప్రచురణలు 8, అయ్యప్ప స్వామి మధురగీతాల CD ఆవిష్కరించబడతాయి.
6. ఓర్లాండో లో బాలబాలికలకిస్వఛ్చందంగా తెలుగు నేర్పుతున్న ఉపాధ్యాయులకి గౌరవ సత్కారం జరుగుతుంది.
వక్తలకి ప్రత్యేక ఆహ్వానం
7. నవంబర్ 2, 2019 సాయంత్రం ఓర్లాండో నగర వాసులకి “12వ ఘంటసాల ఆరాధనోత్సవాలు-9వ బాలూ సంగీతోత్సవం” సినీ సంగీత విభావరి ఉచిత కార్యక్రమం జరుగుతుంది. ప్రధాన గాయనీ గాయకులు “అపర ఘంటసాల తాతా బాల కామేశ్వర రావు (హైదరాబాద్), శారద ఆకునూరి (హ్యూస్టన్), సత్య కడాలి (కొలంబియా, S.C).
ఈ సదస్సులో ఉత్సాహంగా పాల్గొని, మీకు నచ్చిన సాహిత్యపరమైన అంశం మీద ప్రసంగించమని వక్తలని కోరుతున్నాం. మీ ప్రసంగ మకుటం, సంక్షిప్త వ్యాసం మాకు అందవలసిన ఆఖరి తేదీ: October 30, 2019.
అలాగే స్వీయ రచనా విభాగం లో మీ కవితలని సభాముఖంగా వినిపించి ఆనందించమని కవులని కోరుతున్నాం.
ఇందుతో జత పరిచిన నమోదు పత్రం (Registration & Donation Form) డౌన్ లోడ్ చేసుకుని, ఆ వివరాలని మాకు పంపించండి…..ఇ-మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మీ వివరాలు పంపించవచ్చును.
ప్రతినిధులకి ప్రోత్సాహకాలు
ఈ 11వ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు అందరికీ ఈ క్రింది ప్రోత్సాహకాలు లభిస్తాయి.
రెండు రోజులు ఉదయం, మధ్యాహ్నం ఫలహరం, మధ్యాహ్న భోజనం, కనీసం $200 విలువ చేసే సరి కొత్త తెలుగు పుస్తకాలు, సుమారు 30 ఉన్నత స్థాయి సాహిత్య ప్రసంగాలు, లబ్ధప్రతిష్టులైన అంతర్జాతీయ గాయనీగాయకుల మూడు గంటల సినీ సంగీత విభావరి, అన్నింటినీ మించి రెండు రోజుల ఆత్మీయ తెలుగు వాతావరణం లో కలకాలం గుర్తుంచుకునే సాహితీ విందు.
ప్రవేశ రుసుము
సదస్సు నిర్వహిస్తున్న ఫ్లారిడా ప్రతినిధులకి ఒక్కొక్కరికీ కేవలం $50. ఇతర రాష్ట్రాల వారికి అంతా ఉచితమే.
అమెరికా దాతలకు విన్నపం
కేవలం ఖర్చుల నిమిత్త ఈ సదస్సుని ఆర్ధికంగా సమర్ధించి మీ మాతృభాషాభిమానాన్ని చాటుకుంటూ, తెలుగు సాహిత్యం పట్ల ఎనలేని ఆపేక్ష తప్ప లాభాపేక్ష లేని మా చిరు ప్రయత్నాలని ప్రోత్సహించండి. అమెరికాలో పన్ను రాయితీ (Tax-deductible) కలిగిన మీ విరాళానికి తగిన ప్రతిఫలాలు నమోదు పత్రం లో వివరించాం.
విరాళాలు ఆన్-లైన్ లో ఏ క్రెడిట్ కార్డ్ తో అయినా ఈ క్రింది లంకె లో పంపించ వచ్చును.
ON-LINE Registration & Donation WITH ANY CREDIT CARD
Please click or copy & paste the following link in your URL and follow prompts
భారత దేశం లో ఉన్న ఉదారులు మమ్మల్ని సంప్రదించండి.
తెలుగు భాషాసాహిత్యాభిమానులందరినీ రెండు రోజుల పాటు జరిగే ఈ 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సుకు మరొక్క సారి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
దొరకునా ఇటువంటి సేవా!
భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజు
Phone: 832 594 9054
E-mail: vangurifoundation@gmail.com
నరోత్తమ్ జీడిపల్లి (President, Telugu Association of Greater Orlando)
సంచాలకులు
మధు చెరుకూరి (ప్రధాన సమన్వయ కర్త)
సదస్సు కార్య నిర్వాహక సభ్యులు













