అమెరికాలో శ్రీనివాస కళ్యాణంకి పదేళ్ళు…
అమెరికాలో 17 సంవత్సరాలుగా ప్రచురితమవుతున్న ‘తెలుగుటైమ్స్’ 2010 మే 1వ తేదీన మొట్టమొదటిసారిగా అమెరికాలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ‘శ్రీనివాస కళ్యాణ మహోత్సవం’ను నిర్వహించింది. టీటీడి ఆధ్వర్వంలో అమెరికాలో జరిగిన తొలి కార్యక్రమం అదే. ఈ కార్యక్రమానికి కన్వీనర్‌గా తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు వ్యవహరించారు. నేటికీ ఆ కార్యక్రమం జరిగే పదేళ్ళయినా సందర్భంగా ఆ కార్యక్రమం విశేషాలను మీతో మరోసారి పంచుకుంటున్నాము. ఆ కార్యక్రమం విశేషాలు చెన్నూరి వెంకట సుబ్బారావు మాటల్లో…
నేను కన్వీనర్ గా ఆ రోజు అమెరికాలో మొదటి సారిగా ,న్యూ జెర్సీ లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే అత్యంత వైభవం గా శ్రీనివాస కళ్యాణం జరిగిన రోజు. అమెరికా లో జరిగిన మొట్ట మొదటి శ్రీనివాస కల్యాణం జరిగి 10 ఏళ్ళు అయిన సందర్భం గా కొన్ని వివరాలు గుర్తు చేసు కొందాం..
1. ‘విమానమెక్కిన శ్రీనివాసుడు’, ‘అమెరికా కు వెళ్లిన శ్రీ వేంకటేశ్వరుడు’ అంటూ ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ పేపర్ లలో మొదటి పేజీ న్యూస్, టీవీ లలో బ్రేకింగ్ న్యూస్ లు వచ్చాయి .. కొన్ని రోజులు ఆ న్యూస్ మీద అనేక కధనాలు వచ్చాయి
2. టీటీడీ చైర్మన్ శ్రీ ఆదికేశవుల నాయుడు, ఈఓ శ్రీ ఐ వై ఆర్ కృష్ణ రావు గారు ల అంగీకారం తో ఇద్దరు ట్రస్టీ లు , ఐదు గురు ఆఫీసర్లు, ఐదు గురు పూజారులు, ముగ్గురు వేద పండితులు, ముగ్గురు అన్నమయ్య ట్రస్ట్ నుంచి గాయకులు అమెరికా వచ్చారు. ప్రస్తుత JEO శ్రీ ధర్మా రెడ్డి గారు ( అప్పుడు JEO – Admn ) స్వయం గా టీం లీడర్ లాగ అమెరికన్ కాన్సులెట్ ఆఫీస్ కి వచ్చి అందరికి వీసాలు వచ్చేలా సహాయ పడ్డారు.
3. న్యూ జెర్సీ లో శ్రీ గురువాయూరప్పన్ టెంపుల్ లోను, కాలిఫోర్నియా లోని సన్నీవేల్ టెంపుల్ లో 1 మే, 8 మే లలో రెండు కళ్యాణోత్సవాలు అత్యంత వైభవం గా జరిగాయి శ్రీదేవి- భూదేవి సహిత శ్రీనివాస మూర్తి విగ్రహాలు ఒక సెట్ న్యూ జెర్సీ కి, ఇంకో సెట్ కాలిఫోర్నియా రాష్ట్రం లోని సన్నీవేల్ కి తీసుకు వెళ్ళాం. తిరుపతి నుంచి దాదాపు గా 1000 మంది దంపతుల కోసం పూజ సామానులు, కల్యాణ వేంకటేశ్వరుని చిత్ర పఠాలు, shawls తీసుకు వెళ్ళాం. ఇద్దరు మనుషులు విడివిడి గా రెండు చోట్లకి తిరుపతి లడ్డులు తీసుకు వచ్చే ఏర్పాటు చేసాం.
4. తెలుగు సినిమా రంగం లో ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి చే ప్రత్యేకం గా రామా నాయుడు స్టూడియోస్ లో శంఖు చక్రాల తో కూడిన స్వామీ వారి బొమ్మ ను తయారు చేయించి బ్యాక్ డ్రాప్ గా వాడాము
5. అప్పటి భారత దేశ విమాన యాన మంత్రి శ్రీ ప్రఫుల్ పటేల్ స్వయంగా నిర్ణయం తీసుకొని ఎయిర్ ఇండియా ని ఆదేశించటం, ఎయిర్ ఇండియా వారు ఈ సామాగ్రి మొత్తం హుటాహుటిన హైదరాబాద్ నుంచి న్యూ యార్క్ చేర్చటం జరిగింది. ( శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమాల్లో ఒకటి గా చెప్పుకొన్నాం)
6. TV 9 లో లైవ్ టెలికాస్ట్ అయిన మొదటి కళ్యాణోత్సవం లో ఆనాటి ముఖ్య మంత్రి శ్రీ రోశయ్య గారు భక్తులను ఉద్దేశించి 10 నిముషాలు ప్రసంగించారు.
7. దాదాపు 500 మంది దంపతులు కళ్యాణం కి రిజిస్టర్ చేసుకొని కల్యాణోత్సవం లో పాల్గొన్నారు. ఆ రోజు సాయంత్రం వరకు దాదాపు 3000 మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించు కొని తీర్ధ ప్రసాదాలు తీసుకొన్నారు.
8. శ్రీ గురువాయూరప్పన్ టెంపుల్ వుండే మోర్గాన్ విల్లి ప్రాంత మేయర్ , ఇతర అధికారులు కూడా ఈ వేడుకను చూసారు. రోజంతా ఆ ప్రాంతం అంతా మన వాలంటీర్లు తో పాటు పోలీసులు కూడా ట్రాఫిక్ కి మానిటర్ చేశారు.
9. మిత్రులు శ్రీ మహేందర్ ముసుకు, శ్రీ రామ్ వేదాంతం , గురువాయూరప్పన్ టెంపుల్ యాజమాన్యం తో సహా దాదాపు 25 కమిటీలు , 250 మంది వాలంటీర్లు పని చేసిన ఈ వేడుక అత్యంత కన్నుల పండుగ గా, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు మరిచి పోలేని గుర్తు గా వుంది పోయింది.
10. నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు గా నేను భావిస్తాను. అలాగే తెలుగు టైమ్స్ పత్రిక అమెరికా లో సుస్థిరంగా ఉండేలా స్వామివారి దీవెనలు లభించాయి అని భావిస్తాను.
11. ఆ తరువాత ఇప్పటి వరకు అన్నవరం దేవస్థానం వారిని తీసుకువెళ్లి 10 నగరాలలో సత్యనారాయణ వ్రతాలు, భద్రాచల దేవస్థానం వారిచే 13 పట్టణాలలో సీత రామ కల్యాణాలు, విజయ వాడ దుర్గ మ్మ వారి దేవస్థానం వారిచే 10 పట్టణాలలో అమ్మ వారి కుంకుమ పూజలు చేయ గలిగే అవకాశం, అదృష్టం నాకు , తెలుగు టైమ్స్ కి లభించాయి
12. ఆ తరువాత టీటీడీ వారిని 5 సార్లు అమెరికా లో శ్రీనివాస కల్యాణాలు చేయించే అదృష్టం నాకు లభించింది. అంతే కాదు.. అమెరికా లో 20 కి పైగా వున్న వెంకటేశ్వర స్వామి గుడి ల కోసం టీటీడీ వారిచే ఆగమ శాస్త్ర మీద 2 రోజుల వర్క్ షాప్ నిర్వాహణ లో కీలక పాత్ర పోషిచే అదృష్టం లభించింది.
శ్రీ వేంకటేశ్వరా …. నీకు కోటి నమస్కారాలు ….













