PAPA Movie Review: బావోద్వేగాల సమాహారమే ‘పాపా’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ: జేకే ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు : కవిన్, అపర్ణా దాస్, భాగ్యరాజ, వీటీవీ గణేష్, ఐశ్వర్య, ప్రదీప్ శక్తి, తదితరులు
సంగీతం : జెన్ మార్టిన్, కెమెరా: ఎలిల్ అరసు
పాటలు :రవి వర్మ ఆకుల
కో ప్రొడ్యూసర్స్ : శశాంక్ చెన్నూరు, శ్రీకాంత్ నూనెపల్లి, వెంకట్ బొమ్మరాజు
నిర్మాత : శ్రీమతి నీరజ కోట (NRI),
దర్శకత్వం: గణేష్ కె.బాబు
విడుదల తేది : 13.06.2025
తమిళంలో “దాదా” పేరుతో విడుదలై అక్కడ దాదాపు 42 కోట్లు వసూలు చేసిన చిత్రాన్ని తెలుగులో “పాపా” పేరుతో అనువదించి జూన్ 13న థియేటర్లలో విడుదల చేశారు. కాగా సినిమా టాక్ వైజ్ మంచి మూవీ అనడంతో ఆలస్యంగా రివ్యూ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రాన్ని (NRI Producer Smt Neeraja Kota) ఎన్నారై శ్రీమతి నీరజ కోట ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం తమిళంలో క్రియేట్ చేసిన మ్యాజిక్ తెలుగులోనూ రిక్రియేట్ చేయగలిగిందా లేదా అన్నది సమీక్షలో చూద్దాం.
కథ :
కాలేజీలో చదువుకుంటూ పీకల్లోతు ప్రేమలో పడిపోవడమే కాకుండా… పెళ్ళికి ముందే హద్దులు దాటిన ఒక జంట జీవితంలో చోటు చేసుకున్న విచిత్ర మలుపుల సమాహారం “పాపా”. కథగా చెప్పుకోవడానికి చాల సింపుల్ గా అనిపించినప్పటికీ … కథనాన్ని రక్తి కటించిన తీరు ఈ సినిమాలో హైలెట్.
నటీనటుల హవబవాలు :
భాగ్యరాజా,(Bhagya Raja, VTV Ganesh) విటివి గణేష్ తప్ప మిగతా పాత్రలు పోషించినవారు మనకు తెలియనివారే అయినప్పటికీ… ప్రేక్షకులు ఆయా పాత్రలతో సహానుభూతి చెందుతారు. హీరోగా నటించిన కవిన్, హీరోయిన్ పాత్ర పోషించిన అపర్ణాదాస్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తారు.వీరిద్దరికీ అబ్బాయిగా చేసిన మాస్టర్ ఇయాన్ తోనూ మనం ప్రేమలో పడిపోతాం. ముఖ్యంగా క్లైమాక్స్ లో కంట తడి పెట్టని వారంటూ ఎవరూ ఉండరు. హీరోయిన్ అపర్ణాదాస్, కెరీర్ బిగినింగ్ నాటి నయనతారను కాస్త పోలి ఉండడం వల్ల, అట్లీ దర్శకత్వంలో ఆర్య – నయనతార నటించగా ఘన విజయం సాధించిన “రాజా – రాణి” చిత్రం గుర్తుకు వస్తుంది.
సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడిగా గణేష్ కె.బాబు(Ganesh K Babu Director) కచ్చితంగా ముందు ముందు మరింత వింటాం. అందులో సందేహం లేదు. ఛాయాగ్రహణం, సంగీతం కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే అనువాదం పరంగా తీసుకున్న జాగ్రత్తలు “పాపా” చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. డబ్బింగ్ చిత్రమనే విషయం తెలియకుండా… థియేటర్లకు వెళ్లి సినిమా చూసేవాళ్ళు… స్ట్రెయిట్ సినిమా చూస్తున్న అనుభూతిని పొందుతారు. సంభాషణలు కూడా చాలా చోట్ల ఆకట్టుకుంటాయి, కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి కూడా. ఎడిటింగ్ పరంగా ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే మరింత బాగుండేదనిపిస్తుంది. అలాగే సెకండాఫ్ లో హీరోహీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ ను ఇంకొంచెం క్యాష్ చేసుకునెలా రెండుమూడు సీన్స్ కన్సీవ్ చేసుకుని ఉంటే ఎమోషన్ మరింత పండేదనిపిస్తుంది. “సింగిల్ పేరెంటింగ్”లో ఉండే పెయిన్, తండ్రీకొడుకుల మధ్య బాండింగ్ కు ఇంకొంచెం ప్రాధాన్యత ఇచ్చి ఉంటే కూడా ఇంకా బాగుండేదనిపిస్తుంది. అయితే… మనసు తడిని వెలికి తీసే క్లైమాక్స్… ఇటువంటి చిన్న చిన్న కంప్లైంట్స్ కు తావు లేకుండా చేస్తుంది. దర్శకుడి మీద గౌరవం పెంచేలా చేస్తుంది!! నిర్మాత శ్రీమతి నీరజ కోట కోట ఉత్తమాభిరుచికి ఈ చిత్రం అద్దం పడుతుంది. ఒక టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన చిత్రంగా “పాపా” పదికాలాలపాటు నిలిచిపోతుంది!!
విశ్లేషణ :
వయసులో ఉండే ఆకర్షణలు, ఆవేశాలు, అపార్ధాలు, తరాల మధ్య అంతరాలు, వ్యక్తుల మధ్య ఉండే ఇగోలు, ఫ్రెండ్ షిప్, హెల్పింగ్ నేచర్, ముఖ్యంగా బంధాలు, భావోద్వేగాల కలబోతగా “పాపా” చిత్రాన్ని దర్శకుడు గణేష్ బాబు ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు. హృదయాల్ని మెలిపెట్టేసే పతాక సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. బరువెక్కిన గుండెలతో థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు… చాలా రోజుల తర్వాత ఒక ఫీల్ గుడ్ మూవీ చూశామనే సంతృప్తికి లోనవుతారు. ఎలాంటి ఎక్ష్త్రలు లేకుండా చాల సింపుల్ గా వున్నా కథతో … ఫీల్ గుడ్ మూవీస్ ను ఇష్టపడేవాళ్ళంతా మిస్సవ్వకుండా చూడాల్సిన చాలా మంచి చిత్రం “పాపా”.