BMW: రవితేజకు ఆ సక్సెస్ సెంటిమెంట్ కలిసొస్తుందా?
గత కొన్ని సినిమాలుగా మాస్ మహారాజా రవితేజ(raviteja) వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఎప్పటికప్పుడు వరుసపెట్టి సినిమాలైతే చేస్తున్నాడు కానీ అవి అతనికి నిరాశనే మిగులుస్తున్నాయి. దీంతో ఈసారి రూటు మార్చి కిషోర్ తిరుమల(Kishore tirumala) దర్శకత్వంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha Mahasayulaki Wignapti) అనే సినిమాను చేశాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే రవితేజ గత కొన్నాళ్లుగా ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. చాన్నాళ్లుగా రవితేజ ఎక్కువగా మాస్ ఆడియన్స్ పైనే దృష్టి పెట్టి ఆ నేపథ్యంలోనే సినిమాలు తీస్తూ వచ్చాడు. కానీ ఫ్యామిలీ సినిమాలు మాత్రం చేయడం లేదు. అలాంటి మాస్ మహారాజా ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి భర్త మహాశయులకు విజ్ఞప్తి చేసి దాన్ని పండక్కి రిలీజ్ చేస్తున్నాడు.
దానికి తోడు కిషోర్ తిరుమల సినిమాలంటే రొటీన్ కు భిన్నంగా ఉంటాయి. ఈ సినిమా కూడా అలానే కొత్తగా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. పైగా రవితేజ గతంలో చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ సినిమాలన్నీ మంచి సక్సెస్ సాధించినవే. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం(Itlu Sravani Subramanyam), ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు(Avunu Vallidharu Ishtapaddaru), వెంకీ(Venky), అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి(Amma Nanna O Tamila Ammayi), నా ఆటోగ్రాఫ్(Naa Autograph), కిక్(Kick), రాజా ది గ్రేట్(Raja The Great) ఇవన్నీ ఫ్యామిలీ ఎమోషనల్ కథలకు లవ్ స్టోరీలను జోడించి తీసినవే. ఇప్పుడలాంటి బ్యాక్ డ్రాప్ లోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి(BMW) కూడా వస్తుండటంతో ఆ సక్సెస్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని రవితేజ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ సారైనా రవితేజ హిట్ అందుకుంటాడేమో చూడాలి.






