వైష్ణవ్ నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు?
వైష్ణవ్ తేజ్(vaishnav tej) కెరీర్లో ఉప్పెన(Uppena) తర్వాత వచ్చిన క్రేజ్‌ను నిలబెట్టుకోవడంలో వరుస ఫ్లాపులు అడ్డంకిగా మారాయి. కొండపొలం(Kondapolam), రంగ రంగ వైభవంగా(Ranga ranga vaibhavanga), ఆదికేశవ (adhikeshava) సినిమాలు ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ అందుకోకపోవడంతో ఆయన కొత్త ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే గత కొంతకాలంగా పలువురు డైరెక్టర్లు కథలు చెప్పినా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే టాక్ వినిపించింది. ఈ క్రమంలో వైష్ణవ్ నుంచి సినిమా వచ్చి కూడా మూడేళ్లు దాటిపోవడం చర్చనీయాంశంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు వైష్ణవ్ తేజ్ డెసిషన్ తీసుకునే దశకు వచ్చినట్టు తెలుస్తోంది. డైరెక్టర్లు పరశురామ్(parasuram), ప్రవీణ్ సత్తారు(praveen sattaru) చెప్పిన రెండు కథలు ఆయనకు ఇంట్రెస్టింగ్ గా అనిపించినట్టు టాక్. ఇప్పటివరకు విన్న కథల్లో ఈ రెండింటిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అయితే వీటిలో ముందుగా ఏ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలనే విషయంలో ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని తెలుస్తోంది.
పరశురామ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెబితే దిల్ రాజు(Dil raju) నిర్మాణ బాధ్యతలు చేపట్టే అవకాశముందని సమాచారం. దీంతో ఆ సినిమా విషయంలో నిర్మాణం, ప్రమోషన్ పరంగా బలమైన సపోర్ట్ లభించే అవకాశం ఉంది. మరోవైపు ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిర్మాత ఎవరనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ఈ రెండు కథల్లో ఒకదానిని సెలెక్ట్ చేసుకుని త్వరలోనే కొత్త సినిమాను అనౌన్స్ చేసే దిశగా వైష్ణవ్ తేజ్ అడుగులేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది.








