నేను సన్యాసిని కాదు…తప్పకుండా పెళ్లి చేసుకుంటాను
నేను సన్యాసిని కాదు. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. కానీ తేదీ ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేను. ఇప్పటికైతే నేను, దీపికా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నాం అని అన్నారు రణ్వీర్. సన్నిహితుల సమక్షంలో స్విట్జర్లాండ్లో దీపిక పడుకొనేని రణ్వీర్ పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి రణ్వీర్ ఇటీవల సమాధానం చెప్పారు. మా పెళ్లి తేదీ ఇంకా ఫైనలైజ్ కాలేదు. అన్నీ కుదిరితే మేడ పైకి ఎక్కి గట్టిగా అరిచి మరీ చెబుతాను. ప్రస్తుతం దీపిక తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతోంది. ముందు తనకు ఉపశమనం కలగాలి అని అన్నారు. సినిమాల పరంగా రణ్వీర్ గల్లీ బాయ్ తోనూ, దీపికా సప్నా దీదీ తోనూ బీజీగా ఉన్నారు.













