War2: వార్2 ట్రైలర్ పై క్రేజీ అప్డేట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్(Hrithik Roshan) కలయికలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ వార్2(War2). బ్లాక్ బస్టర్ వార్(War) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వం వహించారు. యష్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఆగస్టు 14న వార్2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే సినిమా రిలీజ్ కు మరో నెల రోజులు కూడా లేదు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ వార్2 ట్రైలర్(War2 Trailer) ను రిలీజ్ చేసి సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని చూస్తున్నారు. అందులో భాగంగానే దానికి సంబంధించిన సన్నాహాలు చేస్తున్నారట. కాగా వార్2 ట్రైలర్ పై ఇప్పుడు ఓ అప్డేట్ వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం వార్2 ట్రైలర్ ను జులై మూడో వారంలో రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. అంటే మరో వారంలో వార్2 సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట. ఇప్పటికే వార్2 పై అంచనాలు భారీగా నెలకొన్న నేపథ్యంలో ట్రైలర్ కూడా క్లిక్ అయి, ఆడియన్స్ ను మెప్పిస్తే వార్2 పై అంచనాలు ఆకాశాన్నంటడం ఖాయం.