Vyshnavi Chaitanya: డిజైనర్ లెహంగా లో వైష్ణవి చైతన్య
షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను స్టార్ట్ చేసి బేబీ(Baby) సినిమాతో హీరోయిన్ గా మారిన వైష్ణవి చైతన్య(Vyshnavi Chaitanya) ఆ సినిమాతో మంచి హిట్ తో పాటూ సూపర్ క్రేజ్ ను అందుకుంది. ప్రస్తుతం సిద్దూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda)తో జాక్(Jack) మూవీ చేస్తున్న వైష్ణవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా వైష్ణవి మహారాణిలా మెరిసింది. డిజైనర్ లెహంగా ధరించి దానికి సూటయ్యే జ్యుయలరీ వేసుకున్న వైష్ణవి ఈ ఫోటోల్లో మరింత అందంగా కనిపించింది. వైష్ణవి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













