Viswambhara: విశ్వంభరకు బ్లాక్ బస్టర్ సెంటిమెంట్
భోళా శంకర్(Bhola Shankar) తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నుంచి వస్తున్న సినిమా విశ్వంభర(Vishwambhara). బింబిసార(Bimbisara) ఫేమ్ వశిష్ట(Vasishta) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా యువి క్రియేషన్స్(UV Creations) భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తోంది. వాస్తవానికి విశ్వంభర సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది కానీ గేమ్ ఛేంజర్(Game Changer) కోసం సినిమాను వాయిదా వేశారు. అయితే ఈ వాయిదా వల్ల విశ్వంభర సీజీ వర్క్ మరింత క్వాలిటీతో చేయించే అవకాశం దక్కింది.
సోషియో ఫాంటసీ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డేట్ ను ఫిక్స్ చేయడం వెనుక చాలా పెద్ద కారణమే ఉంది. చిరంజీవి కెరీర్లోనే మంచి హిట్ గా నిలిచిన జగదేకవీరుడు అతిలోకసుందరి(Jagadeka Veerudu Athiloka Sundari) రిలీజ్ అయింది కూడా మే 9వ తేదీనే.
అందుకే ఆ సెంటిమెంట్ కలిసొస్తుందని యువి క్రియేషన్స్ వారు ఆ డేట్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశముంది. దాంతో పాటూ సంక్రాంతికి విశ్వంభర నుంచి ఏదొక సర్ప్రైజ్ ను మెగా ఫ్యాన్స్ కు ఇవ్వాలని టీమ్ చాలా ట్రై చేస్తోంది. ఫ్యాన్స్ కూడా విశ్వంభర అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఉన్నారు.













