Viswambhara: టీజర్ తోనే డైరెక్టర్‌పై ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నుంచి తక్కువ గ్యాప్ లోనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవే విశ్వంభర(Viswambhara) మరియు మెగా157(mega157). యంగ్ డైరెక్టర్ వశిష్ట(Vassishta) దర్శకత్వంలో వస్తోన్న విశ్వంభర షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసిన చిరూ ప్రస్తుతం మెగా157 షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో విశ్వంభర ముందు రిలీజ్ కానుంది.
విశ్వంభరపై ముందు భారీ అంచనాలున్నప్పటికీ టీజర్ రిలీజయ్యాక దాని వల్ల చాలానే విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా సినిమాలోని విఎఫ్ఎక్స్ గురించి చాలా ట్రోల్స్ వచ్చాయి. దీంతో విఎఫ్ఎక్స్ టీమ్ ను మార్చి మళ్లీ కొత్తగా ప్రారంభించి ఇప్పుడా పనుల్ని ఓ కొలిక్కి తీసుకొచ్చిన టీమ్, ఆగస్ట్ 22న చిరూ బర్త్ డే సందర్భంగా ఓ కొత్త టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
అందులో భాగంగానే టీజర్ ను కట్ చేశారని, డైరెక్టర్ వశిష్టకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు విశ్వంభర కొత్త టీజర్ ను చూసి డైరెక్టర్ ను ప్రశంసించారని అంటున్నారు. టీజర్ తో పాటూ మేకర్స్ రిలీజ్ డేట్ ను కూడా అదే రోజున రిలీజ్ చేయనున్నారు. మరి ఈసారైనా విశ్వంభర నుంచి ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్ రిలీజవుతుందో లేదో చూడాలి.







