Viswambhara: మరింత ఆలస్యంగా రానున్న విశ్వంభర
భోళా శంకర్(Bhola Shankar) డిజాస్టర్ అవడంతో తర్వాతి సినిమా విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుని మరీ చిరంజీవి(chiranjeevi) తన తర్వాతి సినిమాను వశిష్ట దర్శకత్వంలో చేస్తున్నాడు. విశ్వంభర(vsiwambhara) అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్(Uv Creations) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మామూలుగా అయితే విశ్వంభర సంక్రాంతికే రావాల్సింది. కానీ షూటింగ్ పూర్తి అవకపోవడంతో పాటూ గేమ్ ఛేంజర్(game changer) ను సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు(Dil Raju) అడగటంతో విశ్వంభర వాయిదా పడింది.
ఆ తర్వాత విశ్వంభరను సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే విశ్వంభర రిలీజ్ ఇంకా లేటవుతుందనిపిస్తుంది. సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా లేట్ గా జరుగుతుండటమే మెయిన్ రీజన్ గా తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ ప్రధానంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో వశిష్ట(vassishta) చాలా కేర్ తీసుకుంటున్నాడట.
తను అనుకున్న ఫలితం వచ్చేవరకు రాజీ పడట్లేదట. టీజర్ విషయంలో వచ్చిన నెగిటివిటీని మైండ్ లో ఉంచుకునే వశిష్ట ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూసుకుంటే విశ్వంభర మరింత ఆలస్యమవడం ఖాయమని అర్థమవుతుంది. త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత కీరవాణి(Keeravani) సంగీతం అందిస్తున్నాడు.













