Viswambhara: విశ్వంభర రిలీజ్ డేట్ పై మెగాస్టార్ క్లారిటీ
వరుస ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవి(chiranjeevi) యంగ్ డైరెక్టర్ వశిష్ట(Vassishta)తో సినిమాను అనౌన్స్ చేసినప్పుడు అందరూ ఎంతో ఆనందంగా ఫీలయ్యారు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఆనందానికైతే అవధుల్లేవు. బింబిసార(bimbisara) తర్వాత వశిష్ట నుంచి వస్తున్న సినిమా కావడం, చాలా కాలం తర్వాత చిరూ సోషియో ఫాంటసీ జానర్ సినిమా చేస్తుండటంతో విశ్వంభర(Viswambhara)పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కానీ ఎప్పుడైతే విశ్వంభర నుంచి టీజర్ వచ్చిందో అప్పట్నుంచి ఆ సినిమాపై దారుణమైన నెగిటివిటీ వచ్చింది. దానికి కారణం టీజర్ లోని వీఎఫ్ఎక్స్. విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా విశ్వంభరకు చాలా డ్యామేజ్ జరిగింది. దీంతో ఆ టీమ్ ను మార్చి ఆ బాధ్యతలను కొత్త టీమ్ కు అప్పగించి మళ్లీ మొదట్నుంచి పనుల్ని మొదలుపెట్టించారు మేకర్స్. దీంతో సినిమా అనుకున్న దాని కంటే చాలా ఆలస్యమవుతూ వచ్చింది.
లేకపోతే ఈ పాటికే సినిమా రిలీజవాల్సింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు మెగాస్టార్ చిరంజీవి ఓ బాంబు పేల్చారు. విశ్వంభర సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుందని, ముఖ్యంగా చిన్న పిల్లలకు, పెద్దవాళ్లలో ఉండే చిన్న పిల్లలకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లా ఉంటుందని అందుకే తమ సినిమాను అందరూ చూసేందుకు వీలుగా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అయితే సినిమా ఆలస్యానికి వీఎఫ్ఎక్స్ వర్క్సే కారణమని కూడా చిరూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. సినిమా సెకండాఫ్ మొత్తం సీజీ, వీఎఫ్ఎక్స్ పై ఆధారపడి ఉండటంతో దానిపై ఎక్కువ టైమ్ కేటాయించాల్సి వస్తుందని అందుకే విశ్వంభరను 2026 సమ్మర్ కు వాయిదా వేస్తున్నట్టు మెగాస్టార్ ప్రకటించారు.







